నెల్లూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం

29 Oct, 2020 11:03 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం రేపింది. ఆనంతసాగరం మండలం రేవూరులో అనుమతి లేకుండా హెలికాప్టర్ లాండింగ్ పై యావత్ యంత్రాంగం ఆశ్చర్య పోయింది. ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఏవియేషన్ అనుమతి తో పాటు స్థానిక పరిపాలన అధికారులు అనుమతి తప్పనిసరి.. కానీ, నెల్లూరు జిల్లా రేవూరు లో అవేవి లేకుండా నే హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కారు లో వచ్చినట్టు ఓ బడా బాబు హెలికాప్టర్ వేసుకొని పెళ్లికి వచ్చేసాడు.
(చదవండి : 70 ఏళ్ల వయసులో యూట్యూబ్‌ సెన్సేషన్‌)

హైదరాబాద్ లో ఉంటున్న  సినీ నిర్మాత, మాజీ ఏవియేషన్ అధికారి రామకోటేశ్వర రావు, రేవూరులో జనార్దన్ రెడ్డి అనే ఎన్నారై ఇంట్లో పెళ్లికి హెలికాప్టర్‌లో వచ్చాడు. ఏవిధమైన అనుమతి లేకుండా, స్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ఓసి తీసుకుని ల్యాండ్ కావడంపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ నెల 27న  గ్రామానికి చెందిన ఎన్నారై బోవెళ్ల జనార్దన్ రెడ్డి  ఆహ్వానం మేరకే హెలికాప్టర్ లో కుటుంబ సమేతంగా రామకోటేశ్వర రావు వచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ అందులో ఉన్న వ్యక్తులు ను దింపి వెళ్ళిపోయింది. అయితే అందులో ఓ మహిళ కు ఆరోగ్యం బాగలేకపోవడం వలనే ఇలా హెలికాప్టర్ లో వచ్చినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా హెలికాప్టర్ ఘటనని అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు