నవంబర్‌ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభం

31 Oct, 2020 12:10 IST|Sakshi

విద్యార్థుల సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి

నవంబర్‌ 11లోపు ఈసెట్‌ అడ్మిషన్లు పూర్తి చేస్తాం

నెలలో పది రోజులు తరగతులు

ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి

సాక్షి, విజయవాడ: కళాశాలలు నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకి మాత్రమే ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి నెలలో పది రోజులు తరగతులు నిర్వహిస్తామన్నారు. మూడవ వంతు విద్యార్థులనే అనుమతిస్తామని వెల్లడించారు. ఆన్‌లైన్‌‌ క్లాసులు కొనసాగుతాయన్నారు. (చదవండి:  ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్‌..

‘‘రెండు సెమిస్టర్లగా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాం. మార్చి నెలకి మొదటి సెమిస్టర్.. ఆగస్ట్ నాటికి రెండవ సెమిస్టర్ పూర్తి చేస్తాం. అకడమిక్ క్యాలెండర్‌ని‌ 180 రోజులుగా రూపొందించాం. ఈసెట్ అడ్మిషన్లు నవంబర్ 11 లోపు పూర్తి చేస్తాం. డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్లని నవంబర్ నెలాఖరుకి పూర్తి చేసి డిసెంబర్ ఒకటి తరగతులు ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహిస్తాం. కళాశాలకి వచ్చే ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కళాశాలకి వచ్చే విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని’’ ఆయన పేర్కొన్నారు. (చదవండి: గ్రూప్‌–1 మెయిన్స్‌కు 9,678 మంది)

మరిన్ని వార్తలు