అసలు నేనేనా అది!

13 Feb, 2022 08:46 IST|Sakshi

సాక్షి, కురబలకోట( చిత్తూరు): ఎవరది.. ఏమా రాజసం.. పందెం కోడి పుంజులా ఎంత పొగరెక్కి ఉందో. ఇదేందిది.. నేను ఎటు కదిలితే అటు కదులుతోంది. ఓహ్‌.. అది నేనేనా! చిత్తూరు జిల్లా కురబలకోట మండలం పోరెడ్డివారిపల్లెలో ఓ కోడి పుంజు బైక్‌ పైకెక్కి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆశ్చర్యపోసాగింది.

తన కదలికలను బట్టి ఆ ప్రతిబింబం తనదేనని గ్రహించిందో ఏమోగానీ.. మరికొంత సేపు చూసుకుని మురిసిపోయి ఆ తర్వాత బైక్‌ దిగి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూపరులకు ముచ్చటగొలిపింది.

మరిన్ని వార్తలు