సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరంజీవి

7 Apr, 2021 11:14 IST|Sakshi

సినిమా థియేటర్లకు విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలు మరో 3నెలలు కొనసాగిస్తూ నిర్ణయం

సాక్షి, అమరావతి: కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువును సినీ ప్రముఖులు కృతజ్ఞతులు తెలిపారు. 

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరు, నాగ్‌
విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం జగన్‌ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

అలాగానే బుధవారం నాగార్జున అక్కినేని కూడా ట్విటర్‌ వేదికగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ‘మహమ్మారి వంటి విపత్కర సమయంలో సినిమా హాల్ల విద్యుత్‌ చార్జీలకు రాయితీ ఇచ్చి అవసరమైన సమయంలో అదుకుని భారీ ఊరటనిచ్చిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

చదవండి: సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారు
 

మరిన్ని వార్తలు