ఏపీ పరిషత్‌ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు

21 May, 2021 10:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ పరిషత్‌ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

పరిషత్‌ ఎన్నికలపై హైడ్రామా
ఏప్రిల్‌ 8న ఏపీలో పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్‌ 1న పోలింగ్‌ తేదీలు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఏప్రిల్‌ 6న పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే ఇవ్వగా, ఏప్రిల్‌ 8న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్టే రద్దు చేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలతో ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించింది. ఏప్రిల్‌ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. నేడు పరిషత్‌ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే
AP Budget 2021: జన సాధికార బడ్జెట్‌

మరిన్ని వార్తలు