హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదు 

14 Aug, 2020 08:01 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫెడరేషన్‌ పిటిషన్‌ తిరస్కరించిన కోర్టు 

సాక్షి, అమరావతి: పలువురు ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకినందున హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫెడరేషన్‌ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు రిజిస్ట్రీ చర్యలు తీసుకుందని తెలిపింది. రోడ్‌జోన్‌గా ప్రకటించడమంటే హైకోర్టును మూసివేయడమేనని, తద్వారా న్యాయం తలుపులు మూసేవేసినట్లవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం గుర్తు చేసింది.

అలాగే కరోనా నిరోధానికి పారా మిలిటరీతో కర్ఫ్యూ విధించేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.   (ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది: కోన రఘుపతి)

మరిన్ని వార్తలు