టీడీపీ నేతల పాదయాత్ర సిగ్గుచేటు!

26 Oct, 2020 10:41 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి కుప్పంలో టీడీపీ నేతలు పాదయాత్ర తలపెట్టడం సిగ్గుచేటని కుప్పం వైఎస్సార్‌ సీపీ ఇన్‌ఛార్జ్‌ భరత్‌ మండిపడ్డారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు అధికారంలో ఉన్న కాలంలో ఎందుకు హంద్రీనీవా కాల్వ పనులు పూర్తి చేయించలేక పోయారని ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీనీవా పనుల పూర్తికి కృషి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారు. కుప్పం ప్రజల పట్ల చంద్రబాబుది కపట ప్రేమగా పేర్కొన్నారు. ( 'ఆ గేదె బాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది' )

కుప్పంలో ఉద్రిక్త వాతావరణం
హంద్రీనీవా జలాల సాధన పేరిట టీడీపీ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం కుప్పంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాదయాత్రకు టీడీపీ నేతలు యత్నించగా రామకుప్పం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీ చేయటానికి  సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించటంతో కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు