మృతుల కుటుంబాలకు భారీ పరిహారం

2 Aug, 2020 15:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ ప్రమాదంపై యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్‌, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల  సహాయం ఇవ్వడానికి  యాజమాన్యం ఒప్పుకుంది. అలాగే మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది.
(చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్‌)

కాగా, షిప్‌ యార్డ్‌ మృతులకు రూ.50లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దమొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్‌, బద్రీనాథ్‌, రఘు కృతజ్ఞతలు తెలిపారు.  కాగా, భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్‌ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్‌ రన్‌ జరుగుతుండగా ఈ భారీ క్రేన్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 
 

మరిన్ని వార్తలు