వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు

9 Apr, 2021 15:22 IST|Sakshi

తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి జీవితమంతా మేనేజ్‌ చేయడమేనని, ఎన్టీఆర్‌, మోదీ, పవన్‌ కాళ్లు పట్టుకుని సీఎం అయిన చరిత్ర బాబుదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల నుంచి పారిపోయిన చరిత్ర చంద్రబాబుదంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్జీమర్స్ వచ్చింది ప్రజలకు కాదు.. చంద్రబాబుకు అని ఎద్దేవా చేశారు.

ఎన్నికల నుంచి పారిపోయిన చంద్రబాబు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు ఖాయం అని చెప్తారు.. పూర్తయ్యాక మళ్లీ పది రోజులు కనపడడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హోదా అడిగితే కేసులు పెడతారని భయపడే వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్ కాదన్నారు. అధికారంలో ఉన్న సోనియాని ఎదిరించి నిలబడ్డారని, ఆయనపై పెట్టిన కేసులు అన్ని దొంగ కేసులని అన్నారు. హోదా విషయంలో చంద్రబాబు చేసింది ప్రజలు మర్చిపోలేదని, చంద్రబాబు ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరి కన్నా చిత్తూరు జిల్లా ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు