పంచాయతీ ఎన్నికల రోజున సెలవు

30 Jan, 2021 04:19 IST|Sakshi

సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు

ప్రభుత్వోద్యోగులు ఏజెంట్లుగా ఉండకూడదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పొలింగ్‌ జరిగే ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీలను స్థానిక సెలవు దినాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీచేసింది. పొలింగ్‌ జరిగే తేదీలకు 44 గంటలకు ముందు ఆయా ప్రాంతాలలో మద్యం షాపులు మూసి వేయాలని వేరుగా మరొక ఉత్తర్వు జారీచేసింది. అలాగే, ఎన్నికల ఏజెంట్లుగా ప్రభుత్వోద్యోగులు పాల్గొనకూడదని కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీచేసింది. ఎన్నికల విధులలో ప్రభుత్వోద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అందులో పేర్కొంది. కాగా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వపరంగా మొత్తం తొమ్మిది జీఓలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ వేర్వేరుగా జారీచేశారు.    

మరిన్ని వార్తలు