అక్ర‌మాల‌కు పాల్ప‌డితే లైసెన్సు ర‌ద్దు

24 Jul, 2020 19:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు :  క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డంలో చాలామంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని రాష్ర్ట‌ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత అన్నారు.  క‌రోనా నియంత్ర‌ణ‌పై జిల్లా అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన ఆమె ఈ మేర‌కు వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజురోజుకి అధిక‌మ‌వుతున్నాయ‌ని నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల కేసుల తీవ్ర‌త పెరుగుంద‌న్నారు. ఇప్ప‌టికే జిల్లా వ్యాప్తంగా ల‌క్షా యాభైవేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ప‌దివేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని  సుచ‌రిత పేర్కొన్నారు.

మూడు వేల బెడ్స్‌తో మ‌రో ప‌న్నెండు ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను సిద్ధం చేశామ‌ని, హాస్పిట‌ల్స్‌లో సిబ్బంది భ‌య‌ప‌డ‌కుండా సేవ‌లందించాలిని ఆ సంద‌ర్భంగా కోరారు. వైద్యం విష‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డితే ప్రైవేటు ఆసుప‌త్రుల లైసెన్సు ర‌ద్దు చేస్తామ‌ని సుచరిత హెచ్చ‌రించారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 48,114 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,147 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,858 కు చేరింది. వీటిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 703 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  (ఏపీలో కొత్తగా 8147 పాజిటివ్‌, 44 మంది మృతి)

మరిన్ని వార్తలు