రమ్య కుటుంబానికి ఇంటి పట్టా 

20 Aug, 2021 13:07 IST|Sakshi
రమ్య కుటుంబ సభ్యులకు ఇంటి పట్టా అందిస్తున్న హోం మంత్రి సుచరిత, ఎంపీ సురేష్‌ తదితరులు

సాక్షి, గుంటూరు : ప్రేమోన్మాది చేతిలో ఇటీవల హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను అందజేసింది. గుంటూరు పరమాయకుంటలోని రమ్య ఇంటికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు శుక్రవారం వెళ్లి ఇంటి నివేశన స్థలం పట్టాను అందజేసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ  రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో అండగా నిలిచారని చెప్పారు. రమ్య కుటుంబానికి రూ.10 లక్షల  ఆర్థిక సాయం చేశామన్నారు.

 ఏటుకూరులో ఇంటి స్థలాన్ని కేటాయించడంతోపాటు రమ్య సోదరి మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వివరించారు. వేధింపులకు గురయ్యే యువతులు, మహిళలు వెంటనే దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ టీడీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, షేక్‌ మహ్మద్‌ ముస్తఫా, మద్దాల గిరిధర్, జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ లాల్‌పురం రాము, తదితరులు పాల్గొన్నారు.

చదవండి : అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహ‌ర్రం : సీఎం జగన్‌

మరిన్ని వార్తలు