‘ప్రజల కోసం పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు’

21 Oct, 2022 08:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. పోలీసుల గౌరవవందనం అందుకున్నారు. 

అనంతరం, మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘పోలీసులు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. మహిళాల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దిశ చట్టం, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, జీరో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. ప్రతి సచివాలయం పరిధిలో మహిళా పోలీస్‌ను నియమించాము. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చర్యలు తీసుకున్నాము’ అని స్పష్టం చేశారు. 

ఇక, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘పోలీస్ శాఖలో సమర్థత పెంచేందుకు చర్యలు తీసుకున్నాము. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చెప్పట్టాము. లోన్ యాప్‌ల నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాము. నాటు సారా నుండి 80 శాతం గ్రామాలకు విముక్తి కల్పించాము. వాటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి కల్పిస్తున్నాము’ అని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు