విజయనగరం జిల్లాలో హాస్టల్‌ వార్డెన్‌ సాహసం.. ప్రాణాలకు తెగించి..

10 Sep, 2022 13:19 IST|Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో హాస్టల్‌ వార్డెన్‌ పెద్ద సాహసం చేశారు. వ్యక్తిగత పనుల మీద వార్డెన్‌ కళావతి తన స్వగ్రామానికి వచ్చారు. అదే సమయంలో భారీ వర్షాలకు గజపతినగరం మండలం మర్రివలస దగ్గర చంపావతి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

సరిగ్గా అదేసమయంలో వార్డెన్‌ హాస్టల్‌లోని విద్యార్థుల పరిస్థితి గురించి ఆలోచించారు. ఆ వెంటనే కళావతి తన సోదరుల సాయంతో నది దాటి ఒడ్డుకు చేరారు. ప్రాణాలకు తెగించి విద్యార్థుల గురించి ఆలోచించిన వార్డెన్‌ కళావతిపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 

చదవండి: (రూ.కోటితో విఘ్నేశ్వరుడు ధగధగ)

మరిన్ని వార్తలు