కోలాహలంగా పట్టాల పంపిణీ

19 Jan, 2021 05:14 IST|Sakshi
విశాఖ జిల్లా నర్సీపట్నం పట్టణంలో ఇళ్ల స్థలాల్లో నిల్చొని ప్లకార్డులతో సీఎంకు థ్యాంక్స్‌ చెబుతున్న మహిళలు

25వ రోజు ఆహ్లాదకరంగా ఇంటిస్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల అందజేత

సాక్షి నెట్‌వర్క్‌: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరుస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 25వ రోజు సోమవారం కూడా ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఇది జగనన్న మాకిచ్చిన స్థలం.. ఇక్కడ ఇల్లు కూడా కట్టిస్తారు.. అంటూ లబ్ధిదారులు ఆనందంగా చెప్పుకోవడం కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 12,722 పట్టాలు, పత్రాలు పంపిణీ చేశారు. ఏలూరు మండలం కొమడవోలు, పాలకొల్లు మండలంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, రాపాక వరప్రసాద్, ముదునూరి ప్రసాదరాజు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు అబ్బయ్యచౌదరి, ఎలీజా పాల్గొన్నారు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9,911 మందికి ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో 6,894 పట్టాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 5,297 పట్టాలు, పత్రాలను పంపిణీ చేశారు. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 4,979 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో 2,890 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్‌గణేష్, గుడివాడ అమర్‌నాథ్, గొల్ల బాబూరావు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2,460 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో 520 మందికి, విజయనగరం జిల్లాలో 251 మందికి పట్టాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలో 153 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు