కరెంట్‌ బిల్లు మీరు కోరినంత తెచ్చుకోవాలా.. ఇలా చేయండి!

27 Apr, 2021 12:19 IST|Sakshi

కావాల్సినప్పుడే స్విచ్చేస్తే.. రావాల్సిన బిల్లే వస్తుంది

లెక్కతప్పని బిల్లుకు అవగాహనే ముఖ్యం

దేనికెంత వినియోగమో తెలుసుకో

ఏసీ వాడితే ఎంత కాలుతుందో తెలుసా?

జనం ముందుకు శాస్త్రీయ విద్యుత్‌ వినియోగం

సాక్షి, అమరావతి: కరెంట్‌ వాడకంపై కాస్త అవగాహన ఉంటే.. కోరినంతే బిల్లు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే చాలామందికి వినియోగం గురించి పెద్దగా తెలియదు. పట్టపగలే లైట్లేస్తారు. గదిలో లేకున్నా ఫ్యాన్‌ ఆఫ్‌ చెయ్యరు. వాడకం కన్నా వృధా అయ్యే విద్యుత్తు ఎక్కువగానే ఉంటోంది. బిల్లు చేతికొచ్చినప్పుడు బెంబేలెత్తే బదులు.. కొన్ని మెళకువలు పాటిస్తే చాలావరకు భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. కరెంట్‌ ఎక్కువ కాల్చే సాధారణ బల్బులే ఇప్పటికీ వాడుతున్నారు. అత్యధిక వినియోగంతో పనిచేసే విద్యుత్‌ ఉపకరణాలే వినియోగిస్తున్నారు. 

ఇదీ లెక్క
ఒక్కో విద్యుత్‌ ఉపకరణం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకు సాధారణ బల్బు వంద వాట్స్‌ అని మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి పది వాడితే.. అది ఒక కిలోవాట్‌. గంటపాటు పది బల్బులు (ఒక కిలోవాట్‌) వేసి ఉంచితే.. ఒక యూనిట్‌ కరెంట్‌ కాలుతుంది. ఇలా ప్రతి విద్యుత్‌ ఉపకరణానికి ఓ లెక్క ఉంది. దీన్ని తెలుసుకుంటే అవసరం మేరకే కరెంట్‌ వాడుకోవచ్చు. అప్పుడు నెలవారీ బిల్లు తగ్గే వీలుంది.

చదవండి: ఆటోమేటిక్‌ చెల్లింపులకు ఏప్రిల్‌ గండం..!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు