నేడు హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం 

1 Sep, 2021 04:05 IST|Sakshi
హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుకానున్న రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం

కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాట్లు 

హాజరుకానున్న చైర్మన్‌ జస్టిస్‌ సీతారామమూర్తి  

కర్నూలు (సెంట్రల్‌): న్యాయ రాజధాని కర్నూలులో మరో న్యాయసంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లోకాయుక్త ప్రారంభం కాగా బుధవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ – హెచ్‌ఆర్‌సీ) ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇటీవల మానవహక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శుక్రవారం గెజిట్‌ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 1వ తేదీన మానవహక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం 10–11 గంటల మధ్య ఆ సంస్థ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్‌ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు జి.శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.   

మరిన్ని వార్తలు