కొనసాగుతున్న అల్పపీడనం

22 Sep, 2020 06:02 IST|Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయవ్య ఒడిశా కోస్తా ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది.

రాగల రెండు, మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనివల్ల కోస్తా తీరం వెంబడి బలమైన గాలులుంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రానున్న 48 గంటల పాటు కోస్తా, సీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. 

మరిన్ని వార్తలు