గడప గడపన ఘనస్వాగతం

18 May, 2022 04:54 IST|Sakshi
విజయనగరంలోని తోటపాలెంలో ఎమ్మెల్యే కోలగట్లని ఆశీర్వదిస్తున్న వృద్ధురాలు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఏడోరోజు నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రజలు ఘనంగా స్వాగతిం చారు. తమ ఇంటికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులను ఆత్మీయంగా ఆహ్వానించా రు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తమకు కలిగిన లబ్ధిని వివరించారు. సంక్షేమ పాలన బాగుందని, అర్హత ఉంటే పథకాలు అందుతున్నాయని చెప్పారు.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యారు. విశాఖ పట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వైఎస్సార్, అన్నమయ్య , కర్నూ లు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ప్రజలు తమకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు