గడప గడపనా ఆదరణ

19 May, 2022 04:42 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా పెద్దమురహరిపురంలో వృద్ధురాలితో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు, కృష్ణా జిల్లా చినగొల్లపాలెం దీవిలో వృద్ధురాలికి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న మంత్రి రమేశ్‌

ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

సాక్షి నెట్‌వర్క్‌: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. బుధవారం ఎనిమిదవ రోజు అన్ని జిల్లాల్లో కార్యక్రమం కొనసాగింది. మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ప్రజలకు కలిగిన లబ్ధిని వివరిస్తూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు సాగారు.

తమకు ఏమేరకు లబ్ధి కలిగిందో ప్రజలు సైతం ఉత్సాహంగా వివరించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ జిల్లాల్లో ఈ కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై పలు సమస్యలను పరిష్కరించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  

మరిన్ని వార్తలు