‘ఈ-రక్షాబంధన్‌’కు విశేష స్పందన

12 Aug, 2020 11:37 IST|Sakshi

సాక్షి, అమరాతి : రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ‘ఈ-రక్షాబంధన్‌’కు విశేష స్పందన లభిస్తోంది. పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా చేపట్టిన యూట్యూబ్‌ సైబర్‌ సేఫ్టీ శిక్షణ సత్పలితాలు ఇస్తోంది. వేలాది మంది మహిళలు శిక్షణా  తరగతులను ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. రోజుకో అంశంపై సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.
(చదవండి : 'వైఎస్సార్‌ చేయూత'ను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌)

నేటితో యూట్యూబ్‌ శిక్షణ తొమ్మిదో రోజుకు చేరింది. ప్రతి రోజు ఉదయం 11-12 గంటల వరకు సైబర్‌ సేఫ్టీ జాగ్రత్తలపై నిపుణులు చర్చిస్తున్నారు. బుధవారం జరిగే చర్చలో సీఐడీ డీజీ సునీల్‌ కుమార్‌, నిపుణులు విమలాదిత్య, నరేష్‌, కొండవీటి సత్యవతి తదితరులు పాల్గొననున్నారు. నెల రోజుల శిక్షణలో లక్షలాదిమంది మహిళలను సైబర్‌ నేరాలను ఎదుర్కొనే సైనికుల్లా తయారు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

కాగా, రాఖీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‘ఈ- రక్షాబంధన్‌’కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్‌ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్‌ ఉమెన్‌కు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహిస్తారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్‌, యానిమేషన్స్‌, రీడింగ్ మెటీరియల్‌ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు