ఆత్మీయ ఆదరణ

14 Jul, 2022 04:48 IST|Sakshi
అనంతపురం జిల్లా చెన్నంపల్లిలో మహిళలతో మంత్రి ఉషశ్రీ చరణ్‌

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు.

అన్ని జిల్లాల్లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే 
పరిష్కరించారు.  

మరిన్ని వార్తలు