పేదల ద్రోహి చంద్రబాబు 

29 Oct, 2020 04:48 IST|Sakshi
మాట్లాడుతున్న బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సత్యన్నారాయణ

మూడు రాజధానుల దీక్షలకు భారీ మద్దతు 

తాడికొండ: బడుగు బలహీన వర్గాలకు రాజధాని ప్రాంతంలో నిలువ నీడ లేకుండా చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సత్యన్నారాయణ విమర్శించారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు ఆయన బుధవారం మద్దతు ప్రకటించారు. రాజధాని భూ సమీకరణ పేరుతో దళితుల లంక, అసైన్డ్‌ భూములను  లాక్కుని నిలువ నీడ లేకుండా చేశాడన్నారు. ఎన్‌ఆర్‌ఐ నిధులతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్న చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో ప్రజాదరణ లేకే ఓటమి పాలయ్యాడనే నిజం తెలుసుకోవాలని హితవు పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం సమష్టిగా అభివృద్ధి, వికేంద్రీకరణ జరుగుతుందనే మూడు రాజధానులకు భారీ మద్దతు వస్తోందన్నారు.   
పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు  

ముస్లిం యువకులకు వేసిన బేడీల సంగతేంటి బాబూ.. 
మూడు రాజధానుల ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులతో పేద ఎస్సీ, మహిళలపై దాడులు చేయించింది చాలక, దాడిచేసిన వారిని అరెస్టు చేస్తే రైతులకు బేడీలు వేశారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలిండియా ఇత్తెహాదుల్‌ ముస్లీమీన్‌ రాష్ట్ర యూత్‌ లీడర్‌ సయ్యద్‌ దాదాపీర్‌ విమర్శించారు. తన గుంటూరు సభలో ముస్లిం యువకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసు బనాయించి బేడీలు వేసి జైళ్లలో పెట్టిన విషయం గుర్తులేదా అని ప్రశి్నంచారు. దీక్షలకు ఏఐఎంఐఎం ప్రకాశం జిల్లాల జాయింట్‌ సెక్రటరీ ఉస్మాన్‌ ఘనీ, రాష్ట్ర యూత్‌ ప్రెసిడెంట్, మైలాలీ, సల్మాన్, మేఘశ్యామ్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. దళిత నేతలు  నత్తా యోనరాజు,  చెట్టే రాజు, పరిశపోగు శ్రీనివాసరావు, పిడతల అభిõÙక్, సుభాíÙణి,  బూదాల సలోమి, సుధారాణి, సౌమ్య, బేతపూడి సాంబయ్య,  పులి దాసు, గంజి రాజేంద్ర, కొలకలూరి లోకేష్, ఈపూరి ఆదాం, లకుమీ పద్మకుమార్, దానయ్య తదితరులు పాల్గొన్నారు.కాగా,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేస్తుండడం విశేషం.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు