మూడు రాజధానుల కోసం బహుజన పోరాటం

23 Nov, 2020 04:54 IST|Sakshi
ప్రతిపక్షాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

54వ రోజుకు చేరిన రిలే దీక్షలు

తాడికొండ: మూడు రాజధానుల సాధన కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 54వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. చంద్రబాబు తన వక్రబుద్ధి మార్చుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకపోతే దళిత, బహుజన సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు రాకుండా అడుగడుగునా అడ్డు తగలడం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు తగదన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు వడిత్యా శంకర్‌నాయక్, చెట్టే రాజు, నూతక్కి జోషి, బూదాల సలోమీ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు