ఈసెట్‌ శిక్షణలో సనాతో పరిచయం.. ఆలయంలో వివాహం.. అనంతరం భార్యను వదిలి..

17 May, 2022 07:51 IST|Sakshi

సాక్షి, మదనపల్లె టౌన్‌: భార్య గర్భ స్రావంకు యత్నించిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ మురళీక్రిష్ణ తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు.. నల్గొండ జిల్లా చింతపల్లె మండలం కుడిమేకు గ్రామానికి చెందిన మహమ్మద్‌సనా(23), 2019లో ఈసెట్‌ శిక్షణలో ఉన్న సమయంలో మదనపల్లె రూరల్‌ మండలం దిగువగాండ్లపళ్లెకు చెందిన రమేష్‌తో పరిచయం ప్రేమగా మారి ఈ ఏడాది జనవరి 4న మదనపల్లెలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఎస్టేట్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని  ఉండగా రెండు నెలల క్రితం  రమేష్‌  భార్యను వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు పట్టుకుని కౌన్సిలింగ్‌ ఇప్పించారు. సజావుగా సాగిన వారి కాపురంలో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో  మహ్మద్‌సనా తనకు గర్భస్రావం అయ్యేందుకు తన భర్త మందులు బలవంతంగా మింగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ మురళీక్రిష్ణ ఆమె భర్తను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.   

చదవండి: (సమ్మర్‌లో స్లిమ్‌గా.. బరువు తగ్గాలనుకునే వారికి వేసవి కాలం వరం)

మరిన్ని వార్తలు