అన్న భార్యతో తమ్ముడి అక్రమ సంబంధం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో..

12 Sep, 2022 10:00 IST|Sakshi

చిల్లకూరు: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుపాలు చేస్తున్నాయి. క్షణికావేశంలో చేసే తప్పులు దారుణాలకు ఒడిగడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతిలో జరిగింది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తమ్ముడిని అన్న కర్రతో కొట్టి హతమార్చిన సంఘటన చిల్లకూరు మండలం కాకువారిపాళెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దెపల్లి బాలాజీ, ప్రతాప్‌(25) అన్నదమ్ములు. ఇద్దరికి వివాహాలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. 10 నెలల క్రితం ప్రతాప్‌ భార్య కాన్పు సమయంలో మృతి చెందింది. దీంతో బాలాజీ తన తమ్ముడు ప్రతాప్‌కు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. అప్పటి నుంచి తన వదినతో చనువుగా ఉంటూ ఆమెతో అక్రమ సంభందం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రతాప్, తన వదిన ఒకే దగ్గర ఉండడం చూసిన అన్న బాలాజీ కోపోద్రిక్తుడై ప్రతాప్‌పై కర్రతో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

స్థానికుల సమాచారం మేరకు గూడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.   

ఇది కూడా చదవండి: రీల్స్‌ చేస్తూ నీళ్లలో పడి మృతి.. అమృత బతుకుతుందని ఉప్పుపాతర!

మరిన్ని వార్తలు