కన్నీటి బతుకులు 

7 Sep, 2020 09:25 IST|Sakshi
భార్య ఉషారాణికి భోజనం తినిపిస్తున్న రామిరెడ్డి

పొట్టకూటి కోసం వచ్చారు 

సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు

భార్యకు అనారోగ్యం 

కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి లేదు  

గూడూరు: ఆ కుటుంబం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చింది. విధి వారిని చిన్నచూపు చూసింది. కొంతకాలంగా సమస్యలు వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని మరింత చిన్నాభిన్నం చేసింది. ఓ వైపు అనారోగ్యంతో భార్య.. పనుల్లేవు.. పూట గడవడమే కష్టంగా మారింది. వీధిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

 ♦సూరం రామిరెడ్డి. ఇతనిది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లా రాజోల్‌ ప్రాంతం.
 ♦అక్కడే ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూ 2008వ సంవత్సరంలో బదిలీపై గూడూరుకు వచ్చాడు.
 ♦పట్టణంలోని ఎగువవీరారెడ్డిలో ఇంటిని అద్దెకు తీసుకుని భార్య ఉషారాణి, తల్లి లలితమ్మతో జీవనం ప్రారంభించాడు.  
 ♦2016వ సంవత్సరం వారి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది.
 ♦రామిరెడ్డి భార్యకు గుండె నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు స్టంట్‌ వేయాలని చెప్పారు.
 ♦చిన్నపాటి జీతంతో జీవనం సాగిస్తున్న రామిరెడ్డి అప్పులు చేసి భార్యకు స్టంట్‌ వేయించాడు.
 ♦అయితే 6 నెలలకే అది ఫెయిలైంది. దీంతో ఉషారాణికి బైపాస్‌ సర్జరీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. రామిరెడ్డి మళ్లీ తీవ్ర ఇబ్బందులు పడి సర్జరీ చేయించాడు.
 ♦కాగా రామిరెడ్డి అనివార్య కారణాల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. తర్వాత ఫైనాన్స్‌లో ఆటో తీసుకుని నడుపుతూ వచ్చాడు.
 ♦తీవ్రంగా కష్టాలు పడుతున్న సమయంలో ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది.
 ♦2019వ సంవత్సరం డిసెంబర్‌ నెలలో రోడ్డు ప్రమాదంలో రామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. కొంతకాలం మంచానికే పరిమితమయ్యాడు. ఈ సమయంలో వృద్ధురాలైన అతని తల్లి కుట్టుమెషిన్‌ కుడుతూ కుటుంబానికి అండగా నిలిచింది. 
 ♦రామిరెడ్డి కోలుకుని ఆటో నడుపుతూ భార్య, తల్లిని చూసుకుంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఉషారాణికి మళ్లీ అనారోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రిలో చూపించారు. ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లుగా నిర్ధారించారు. ఆ కుటుంబం మరిన్ని సమస్యల్లో మునిగిపోయింది.
 ♦నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తూ ఆమెకు చికిత్స చేయిస్తూ వచ్చాడు. 
 ♦కరోనా మహమ్మారి వారిని మరింత కష్టాల్లోకి నెట్టింది. రామిరెడ్డి ఉపాధిపై దెబ్బ పడింది.
 ♦లాక్‌డౌన్‌తో ఆటో నడపలేని పరిస్థితి వచ్చింది. నగదు సక్రమంగా కట్టలేదని ఫైనాన్స్‌ నిర్వాహకులు ఆటోను తీసుకెళ్లిపోయారు.
 ♦ప్రస్తుతం రామిరెడ్డి క్యాటరింగ్‌ పనులకు వెళ్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ పనులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
 ♦భార్య  వైద్యానికి నగదు లేక.. ఇంటి అద్దె కట్టలేక.. ఆ కుటుంబం పూర్తిగా దయనీయ స్థితికి చేరుకుంది. దాతలు స్పందించి ఆదుకోవాలని రామిరెడ్డి కోరుతున్నాడు.

రామిరెడ్డి ఫోన్‌ నంబర్‌ : 99510 51069 
అకౌంట్‌ నంబర్‌ 20124209527 
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : 
ఎస్‌బీఐఎన్‌ 0007457 

మరిన్ని వార్తలు