ఏపీ సీఎస్‌పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్‌ అసోసియేషన్‌

9 Feb, 2023 18:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్‌ అసోసియేషన్‌ తెలిపింది. సీఎస్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు.

తప్పుడు కథనాలపై ఐఏఎస్‌ అసోసియేషన్‌లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్‌ వివరణ ఇచ్చారు. సీనియర్‌ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
చదవండి: ‘లోకేష్‌ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’

మరిన్ని వార్తలు