ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌కు బాధ్యతలు

19 Oct, 2022 19:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్‌ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌ బాధ్యతలు చేపట్టారు.

సీఎస్‌గా కె విజయానంద్‌కు తాత్కాలిక అదనపు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రెటరీ సమీర్‌ శర్మ ఆస్పత్రిలో ఉన్నందున కె విజయానంద్‌ తాత్కాలిక అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. 

చదవండి: అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్‌ జగన్ దిశానిర్దేశం

మరిన్ని వార్తలు