ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

16 Aug, 2021 16:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా, గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. స్టేట్ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా రవిశంకర్‌ నారాయణ్‌ బదిలీ కాగా, పీయూష్ కుమార్ జీఏడీకి బదిలీ అయ్యారు. సీసీఎస్‌ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం, సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీగా హరిజవహర్‌లాల్‌లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
 

మరిన్ని వార్తలు