ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

5 Sep, 2021 08:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు. ఏఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ కె.విజయను ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా, ఏంఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.లక్ష్మీనర్సింహంను సీసీఎల్‌ఏలో అప్పీల్స్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (గ్రామ, వార్డు సచివాలయాలు) పి.ప్రశాంతిని సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా బదిలీ చేసి ఏఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.

తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా–సంక్షేమం) జి.రాజకుమారిని గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ (గ్రామ, వార్డు సచివాలయ)గా బదిలీ చేశారు. కడప సబ్‌ కలెక్టర్‌ పృధ్వీతేజ్‌ను ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేసి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
సబ్‌ రిజిస్ట్రార్‌ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర   
వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్‌ వన్‌

మరిన్ని వార్తలు