ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ

28 Jun, 2022 21:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: పలువురు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌కు కృష్ణా, గోదావరి కెనాల్స్‌ క్లీన్‌ మిషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎంఐజీ ప్రత్యేక అధికారి, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీగా పనిచేస్తున్న పి.రాజాబాబుకు రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఇచ్చారు. నెల్లూరు డీఎఫ్‌వోగా పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి వై.వి.కె.షణ్ముఖ్‌ కుమార్‌ను శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ సీఈవోగా బదిలీ చేశారు.

అక్కడ సీఈవోగా ఉన్న జి.సురేష్‌ కుమార్‌కు గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఐటీ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి బి.సునీల్‌కుమార్‌రెడ్డికి అదనంగా ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ డిప్యూటీ సీఈవో, ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూనివర్సిటీస్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ స్పెషల్‌ డ్యూటీగా పూర్తి బాధ్యతలు ఇచ్చారు.నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌ హరీంద్ర ప్రసాద్‌ను ఆరోగ్యశ్రీ ట్రస్టు అదనపు సీఈవోగా బదిలీ చేశారు. పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌కు నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. పార్వతీపురం జేసీ ఒ.ఆనంద్‌కు ఐటీడీఏ పీవోగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు 
కూడా ఇచ్చారు.   

చదవండి: (ఏపీఐఐసీ కీలక నిర్ణయం.. పారిశ్రామికవేత్తలకు భారీ ఊరట)

మరిన్ని వార్తలు