ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ

10 Sep, 2021 11:08 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా సమీర్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. అక్టోబర్‌ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్నారు.

ఇవీ చదవండి:
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం  

మరిన్ని వార్తలు