సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం

9 Jan, 2023 18:50 IST|Sakshi

ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తి

సిక్కోలు గుండెలో భద్రంగా నాటి జ్ఞాపకాలు

ఇచ్ఛాపురంలోనే యాత్ర ముగింపు   

ఇచ్ఛాపురం రూరల్‌: సరిగ్గా నాలుగేళ్ల కిందట.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద.. అశేష జన సందోహం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. 3,648 కిలోమీటర్ల మేర 341 రోజుల పాటు సాగిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఆఖరి అడుగు లొద్దపుట్టిలో పడింది. ఆ అడుగే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు పునాదిని పటిష్టం చేసింది. నాలుగేళ్లయినా ఆ జ్ఞాపకాలు సిక్కోలు గుండెల్లో ఇంకా పచ్చగా మెదులుతున్నాయి.  


ఒక్కడిగా మొదలై.. ఒక్కొక్కరిని కలుపుకుంటూ.. ఉప నదులు తోడైన మహానదిలా రాష్ట్రమంతా సాగిన ఈ పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా సాగిన పాదయాత్ర ఆఖరి ఘట్టంలో వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగం ఇంకా చాలా మందికి గుర్తుంది.


నేడు అందరితో ప్రశంసలు పొందుతున్న నవరత్నాలను ఆనాడే వైఎస్‌ జగన్‌ వివరించారు. పాదయాత్రలో చూసిన కష్టాలతోనే సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారు. ఈ యాత్ర ఇచ్చిన సత్తువతోనే జనం గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. యాత్ర ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపం కూడా ఏర్పాటు చేశారు. ఇదిప్పుడు మంచి పర్యాటక స్థలంగా పేరు పొందింది.  


కోట్ల హృదయాలను గెలుచుకున్నారు 

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఆయన ప్రజల కష్టాలను నేరుగా చూడటంతో అవి తీర్చడానికే హామీలిచ్చి 97 శాతం నెరవేర్చారు. ఆయనతో అడుగులు కలపడం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం. 
– పిరియా సాయిరాజు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం
     

ఆ చెమట చుక్కే అభివృద్ధికి చుక్కాని 

ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిందించిన చెమట చుక్కలన్నీ రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలయ్యాయి. ఓ సమర్థుడైన పాలకుడి పాలన కోసం ఎదురు చూసిన కోట్లాది మంది ప్రజల కలలను నిజం చేస్తూ ఆయన సంక్షేమ పాలన సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇచ్ఛాపురంలో పడిన జగనన్న అడుగుల చప్పుళ్లు, ఇచ్చిన హామీలు, నెరవేర్చిన వైనాలు సిక్కోలు ప్రజలు ఎప్పటికీ తమ గుండెల్లో పదిలంగానే ఉంటాయి. 
– పిరియా విజయ, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్, శ్రీకాకుళం  
   
కలలో కూడా ఊహించని అవకాశం  
ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏ ము ఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాలు ఇవ్వలేదు. తన క్యాబినెట్‌లో దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన జగనన్న ఇచ్ఛాపురం శివారు ప్రాంతంలో నన్ను డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. నాకు ఈ అవకాశం వస్తుందని కలలోనైనా అనుకో లేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించి, నా లాంటి వంద లాది మందిని అందలమెక్కించారు.
– ఎస్‌.సుగుణ, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ 

మరిన్ని వార్తలు