ప్రాజెక్టుల వద్ద ఎవరూ గుమికూడరాదు: ఎస్పీ ఫక్కీరప్ప

1 Jul, 2021 11:40 IST|Sakshi
ఎస్పీ ఫక్కీరప్ప ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం, పోతిరెడ్డిపాడు,హెడ్‌ రెగ్యులేటర్‌, రాజోలు బండ డైవర్షన్‌ స్కీమ్‌ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్‌ ఏర్పాటు చేశామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్కడ ఎవరూ గుమికూడరాదని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. శాంతి భద్రతలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

కాగా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు మోహరించారు. మహబూబ్‌నగర్ జూరాల ప్రాజెక్ట్‌ వంతెనపై తెలంగాణ పోలీసులు రాకపోకలు నిషేధించారు.  తెలంగాణ పోలీసుల పర్యవేక్షణలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. అత్యవసరమైతేనే తప్ప అనుమతించటం లేదు. గద్వాల, ఆత్మకూరు, మక్తల్‌ మధ్య రాకపోకలు బందయ్యాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు