అనపర్తిలో బాబు హైడ్రామా.. ఐజీ పాలరాజు కీలక వ్యాఖ్యలు

18 Feb, 2023 20:41 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓవరాక్షన్‌ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కాగా, ఈ ఘటనపై భీమవరం ఐజీ పాలరాజు స్పందించారు. 

ఈ క్రమంలో ఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. అనపర్తిలో చంద్రబాబు పర్యటనలో స్థానిక నేతలు రోడ్డుపై సభ నిర్వహించడానికి వీలులేదని చెప్పాము. ర్యాలీగా వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. బహిరంగ సభకు అనుమతి లేదు. రెండు సభా స్థలాలు చూపించాము. స్థానిక నేతలు అనపర్తిలో సభ నిర్వహిస్తామని చెప్పారు. అనపర్తిలో యాక్ట్‌ 30 అమలులో ఉందని తెలిపాము. అనుమతుల విషయంపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. నిబంధనలకు విరుద్దంగా సభ జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు బస్సు అద్ధాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో చర్యలు తీసుకున్నాము. ఏ పార్టీ అయినా నిబంధనల ప్రకారం సభ నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేశారు.  
 

>
మరిన్ని వార్తలు