Weather Report: ఏపీకి ఐఎండీ చల్లని కబురు.. 

19 Apr, 2022 09:11 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఏటా జూన్‌ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజను ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలే కురుస్తాయని తాజాగా వెల్లడించినా రాష్ట్రానికి మాత్రం సమృద్ధిగా వానలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ వార్త ఇటు రైతాంగానికి, ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తోంది. గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఇటు నైరుతి, అటు ఈశాన్య రుతుపవనాలు మంచి వర్షాలే కురిపిస్తున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

చదవండి: సర్‌ప్రైజ్‌ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి..

2021లో ఈ జిల్లాల్లో అధికం 
ఇక రాష్ట్రంలో నైరుతి సీజనులో సగటు సాధారణ వర్షపాతం 514 మిల్లీమీటర్లు కాగా.. 2021లో (జూన్‌–సెపె్టంబర్‌) 613.3 మిల్లీమీటర్లు (+19 శాతం) కురిసింది. కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. 

మరిన్ని వార్తలు