రాయలసీమలో నేడు, రేపు వానలు

24 Aug, 2021 07:30 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా తేమగాలులు రాయలసీమ వైపుగా పయనిస్తున్నాయి. దీంతో పాటు తీరం వెంబడి తూర్పు–పశ్చిమ గాలుల కలయిక (షియర్‌ జోన్‌) కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమలో మంగళ, బుధవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. 

చదవండి: ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు 27 వరకు గడువు

మరిన్ని వార్తలు