AP: ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన

12 Sep, 2022 09:33 IST|Sakshi

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీంతో, ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

అల్ప పీడనం ప్రభావంతో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలని వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  

ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు