కోవిడ్‌ చికిత్సకు ఆరోగ్యశ్రీ రేట్లు పెంపు

12 May, 2021 03:46 IST|Sakshi

ఆర్టీపీసీఆర్‌ లేకపోయినా సీటీ స్కాన్‌తో పేషెంట్లను చేర్చుకోవాలి

వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ చికిత్సలకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సీటీ స్కాన్‌లో కొరాడ్స్‌–4, సీటీ సివియారిటీ స్కోర్‌ 25 ఉండి, ఆర్టీపీసీఆర్‌ టెస్టు లేకపోయినా పేషెంట్లను అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్‌ సాయంతో ఉన్న రోగులకు రోజుకు రూ. 2,500 చెల్లిస్తామన్నారు. గతంలో నాన్‌క్రిటికల్‌ ట్రీట్‌మెంట్‌కు రూ. 3,250, వెంటిలేటర్‌ లేని ఐసీయూకు రూ.5,480, ఐసీయూతో వెంటిలేటర్‌కు రూ.9,580, క్రిటికల్‌ పేషంట్లకు వెంటిలేటర్‌తో చికిత్సకు రూ. 10,380 ఇచ్చేవారు. 

మరిన్ని వార్తలు