పెరిగిన పగటిపూట ఉష్ణోగ్రతలు

9 Sep, 2020 05:35 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎండలు మండుతున్నాయి. పగటి పూట పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత మంగళవారం కూడా కొనసాగింది. పగటి పూట ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మచిలీపట్నంలో 36.4, కడపలో 36.3, రాజమహేంద్రవరం, తునిల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.

► ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం, లక్షద్వీప్‌ ప్రాంతానికి దగ్గరగా కొనసాగుతున్న ద్రోణిలో విలీనం అయ్యింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో అంటే బుధ, గురు వారాల్లో రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రాలో పలు చోట్ల మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు