‘రెండో అతిపెద్ద రిటైల్‌చైన్‌గా భారత్‌ మారింది’

7 Jun, 2022 19:10 IST|Sakshi

రాజమండ్రి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశంలో అవినీతి రహిత పాలనను మోదీ అందిస్తున్నారని, 2014 తర్వాత దేశంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘చారిత్రాత్మక రాజమండ్రి నగరానికి రావడం సంతోషంగా ఉంది.చరిత్రలో రాజమండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చారు. మోదీ హయాంలోనే దేశంలో పేదరిక తగ్గింది. అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.భారత​ నుంచి 500 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి.  రెండో అతిపెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారింది. దేశంలో 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు. భారత్‌ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు