రైల్వేలో మానవ రహిత సిగ్నలింగ్‌ వ్యవస్థ

17 Nov, 2022 15:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాలను నివారించే దిశగా త్వరలోనే ఆధునిక అన్‌మేన్డ్‌ ఆటోమేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను రైల్వే శాఖ ప్రవేశపెట్టబోతోంది. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ సిగ్నలింగ్‌ వ్యవస్థ స్థానంలో ‘ఇండీజినస్‌ కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రెయిన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (ఐ–సీబీటీసీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. 

సంప్రదాయ వ్యవస్థకు మంగళం 
భారతీయ రైల్వే దశాబ్దాలుగా సంప్రదాయ సిగ్నలింగ్‌ వ్యవస్థనే కొనసాగిస్తోంది. ట్రాక్‌ సర్క్యూట్లు, యాక్సెల్‌ కౌంటర్ల ద్వారా రైళ్ల గమనాన్ని తెలుసుకుంటూ రంగుల లైట్ల ద్వారా రైళ్ల లోకో పైలట్లకు సిగ్నల్స్‌ తెలిపే విధానాన్ని అనుసరిస్తోంది. రైళ్ల గమనాన్ని తెలుసుకోడానికి, నియంత్రించడానికి ఈ విధానం సరైనదే. కానీ.. మన దేశంలోని 68,103 కి.మీ. పొడవైన రైల్వే ట్రాక్‌లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి ప్రస్తుత వ్యవస్థ సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత సిగ్నలింగ్‌ స్థానంలో ఐ–సీబీటీసీ పేరుతో పూర్తిగా మానవ రహిత సిగ్నలింగ్‌ వ్యవస్థను రూపొందించనుంది. 

చదవండి: (ఉద్యోగులకు సీఎం జగన్‌ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు: సజ్జల)

మరిన్ని వార్తలు