7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం

23 Jan, 2021 09:04 IST|Sakshi

గన్నవరం విమానాశ్రయాన్ని కప్పేసిన పొగమంచు

సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దాంతో గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇక శనివారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాలిలో చక్కర్లు కొట్టింది. 7 సార్లు చక్కర్లు కొట్టిన అనంతరం దిగేందుకు వీలులేక హైదరాబాద్ వెనుదిరిగింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు