రెండు అలంకారాల్లో దుర్గమ్మ

24 Oct, 2020 08:50 IST|Sakshi

ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు

సాక్షి, విజయవాడ:  దేవి శరన్నవ రాత్రి మహోత్సవాలలో భాగంగా శనివారం దుర్గమ్మ రెండు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అష్టమి, నవమి తిథులు (ఒకేరోజు రెండు తిథులు) ఉండటంతో రెండు అలంకారాల్లో కనువిందు చేయనున్నారు. ఉదయం దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్ధినీదేవిగా  అమ్మ దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడిని అష్టమి తిథినాడు వధించి ఇంద్రకీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించారు. అలాగే మధ్యాహ్నం అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధని దేవీగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టబుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది ఈ తల్లే... ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గమ్మ వారి నిజ స్వరూపం కూడా ఇదే కావడం విశేషం. (చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే)

దుర్గమ్మ సన్నిధిలో డీజీపీ సవాంగ్‌
ఇక  సాధారణ భక్తుల రద్దీకి తోడు పలువురు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శనివారం ఉదయం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈవో సురేష్‌ బాబు.. అమ్మవారి లడ్డూ ప్రసాదం డీజీపీకి అందచేశారు. 

మరిన్ని వార్తలు