ఈ ‘పరిషత్‌’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు

11 Nov, 2021 02:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.  

చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే

పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు