ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం .. డబ్బు వెనక్కు..

4 Jun, 2021 19:27 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి :  ఆరోగ్య శ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేస్తూ రోగి బంధువుల నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసిన ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం చెందింది. ఆసుపత్రి యాజమాన్యం రోగి నుండి వసూలు చేసిన రూ.4.50 లక్షలు కలెక్టర్ సమక్షంలో తిరిగి బాధితుని బంధువులకు అందచేసింది. ఇనోదయ ఆసుపత్రి ఇటీవల పెద్దాపురంకు చెందిన ఒక కరోనా రోగికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేస్తూ..వారి బంధువుల నుండి అక్రమంగా రూ.4.50 లక్షలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని బాధితులు ఆశ్రయించడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇనోదయ ఆసుపత్రిని డి నోటిఫై చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి రూ.22,50,000 పెనాల్టీ విధించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు