16 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ తరగతులు

10 Aug, 2021 04:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని వివిధ యాజమాన్యాల్లోని జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ తరగతులను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు కోవిడ్‌ ప్రోటోకాల్‌ నిబంధనలను అనుసరించి తరగతుల నిర్వహణకు వీలుగా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గత నెల 12వ తేదీ నుంచి సెకండియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను బోర్డు నిర్వహిస్తోంది.

ప్రస్తుతం విద్యాసంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో జూనియర్‌ కాలేజీల్లోనూ తరగతి గది బోధనను చేపట్టేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించనందున గత ఏడాది ఫస్టియర్‌ విద్యార్థులందరినీ ఇంటర్మీడియెట్‌ బోర్డు మినిమమ్‌ పాస్‌ మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 5.12 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు సెకండియర్‌ తరగతులకు హాజరుకానున్నారు.   

మరిన్ని వార్తలు