Facts About Vande Bharat Express: సికింద్రాబాద్‌ టు విశాఖ.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలివే..

12 Jan, 2023 15:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అత్యంత వేగంగా నడిచే వందేభారత్‌ రైలు బుధవారం విశాఖపట్నం చేరుకుంది. చెన్నైలో గల ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి ప్రాథమిక నిర్వహణ నిమిత్తం ఈ రైలు ఇక్కడికి వచ్చింది. దీనిని నిర్వహణ నిమిత్తం కోచింగ్‌ కాంప్లెక్స్‌కు పంపించారు. తదుపరి ఆదేశాలు వచ్చిన తరువాత ఈ రైలును సికింద్రాబాద్‌ పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.  

వందేభారత్‌ ప్రత్యేకతలు 
ఈరైలు బయట నుంచి చూడడానికి విమానాన్ని పోలి ఉంటుంది. మిగిలిన రైలు కోచ్‌ల కంటే ఇవి తేలికైనవి. 
మొత్తం 16 కోచ్‌లు, 1128 సీటింగ్‌ సామర్ధ్యం, మొత్తం శీతల కోచ్‌లు. 


మధ్యలో గల రెండు కోచ్‌లు మొదటి తరగతి కోచ్‌లు, ఇవి 52 సీటింగ్‌ సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన కోచ్‌ల్లో మాత్రం విమానం మాదిరిగా 78 రిక్లైనింగ్‌ సీట్లు ఉంటాయి. 
ఈ కోచ్‌ల పొడవు 23 మీటర్లు, మొత్తం రైలు ఫ్రేమ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో నిర్మించబడింది.  


ఆటోమెటిక్‌ ఇంట్రీ, ఎగ్జిట్‌ స్లైడింగ్‌ డోర్స్, వ్యక్తిగతంగా చదువుకునేందుకు వీలుగా లైటింగ్‌ సదుపాయం, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్స్, సహాయకుడిని పిలిచే సదుపాయం, బయో టాయ్‌లెట్స్, సీసీ టీవి కెమెరాలు, రీ సైక్లింగ్‌ సదుపాయాలు 
దీని ప్రయాణ గరిష్ట వేగ పరిమితి గంటకు 160 కి.మీ. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు