పెళ్లి పందిరి నుంచి పోలింగ్‌ కేంద్రానికి..

16 Nov, 2021 03:32 IST|Sakshi
పెళ్లి దుస్తులతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన దిలీప్‌

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించున్న వరుడు

కుప్పం: కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుప్పం 23వ వార్డు మునస్వామిపురానికి చెందిన దిలీప్‌కు, మంకలదొడ్డికి చెందిన రజినీతో సోమవారం ఉదయం పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో వివాహం జరిగింది. మునిసిపాలిటీలో దిలీప్‌కు ఓటు ఉండడంతో పెళ్లి పందిరి నుంచి పెళ్లి దుస్తులతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చాడు. 23వ వార్డు పోలింగ్‌ జరుగుతున్న ఆర్‌ పేట పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుని ఓటుపై తనకు ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు. 

మరిన్ని వార్తలు